Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉపాధి కోసం ముంబయిలో ఆటో నడుపుకుంటున్న సీరియల్ నటి

  • పగలు సీరియల్స్ లో యాక్టింగ్
  • రాత్రుళ్లు ఆటో డ్రైవింగ్
  • స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న నటి
ఇవాళ టీవీ రంగం కూడా సినిమా ఇండస్ట్రీతో పోటీపడుతోంది. సంవత్సరాల తరబడి కొనసాగే సీరియళ్లు, గేమ్ షోలు, రియాల్టీ షోలతో బుల్లితెర నటులు ఫర్వాలేదనిపించే స్థాయిలో కాసులు కళ్లజూస్తున్నారు. అయినప్పటికీ కొందరి ఆర్థిక కష్టాలు తీరడంలేదు. అందుకోసం, ఓవైపు నటిస్తూనే, మరోవైపు ఇతర వృత్తుల్లో కొనసాగుతున్నారు. ముంబయికి చెందిన సూపర్ లక్ష్మి కూడా ఈ కోవలోకే వస్తారు.

లక్ష్మి ఓ మరాఠీ సీరియల్ నటి. ఆమెను అందరూ సూపర్ లక్ష్మి అనే పిలుస్తారు. అందుకు బలమైన కారణమే ఉంది. లక్ష్మి పగటిపూట టీవీ సీరియళ్లలో నటిస్తుంది. రాత్రివేళ ఏ అమ్మాయి సాహసించని విధంగా ముంబయి మహానగరంలో ఆటో నడుపుతుంది. ఆ విధంగా వచ్చిన సొమ్మును తన కుటుంబపోషణకు ఉపయోగిస్తుంది.

ఇటీవల ప్రముఖ నటుడు బొమన్ ఇరానీ కూడా లక్ష్మి ఆటోలో ప్రయాణించి అచ్చెరువొందారు. ఓ నటి ఆటో కూడా నడుపుతూ ఉపాధి పొందడం ఆయనను విస్మయానికి గురిచేసింది. ఇది తాను ఏమాత్రం ఊహించని విషయం అని బొమన్ ఇరానీ పేర్కొన్నారు. అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచే రియల్ లైఫ్ హీరో అంటూ మెచ్చుకున్నారు.

Mumbai
Super Laxmi
Auto

More Telugu News